![]() |
![]() |
.webp)
ఈ మధ్యకాలంలో బాడీ షేమింగ్ పదం తరచూ వినిపిస్తోంది. జెండర్ తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ బాడీ షేమింగ్ చేయడం సాధారణమైపోయింది. అదే ఇండస్ట్రీలో ఆ తేడా ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బుల్లితెర మీద ఫేమస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ ని ఫేస్ చేసే ఇంత దూరం వచ్చింది. అలాంటి శ్రీముఖి తన తల్లితో కలిసున్న ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఈరోజు శ్రీముఖి టాప్ యాంకర్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ..నవ్విస్తూ.. స్పాంటేనియస్‌గా జోకులు వేస్తూ షోస్ ని టాప్ రేటింగ్ కి తీసుకెళ్లే యాంకర్ గా పేరు తెచ్చుకుంది. మంచి స్పాంటేనిటీతో, క్యూట్ లుక్స్ తో ఇప్పుడు తనని తాను బాగా సాన బెట్టుకుని ఓ రేంజ్ యాంకర్ అయ్యింది. ప్రతీ షోకి అనసూయనే యాంకర్ అనే పరిస్థితి వచ్చేసింది. అలాగే మంచి క్యారెక్టర్స్ ఉంటే మూవీస్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది . బిగ్‌బాస్ సీజన్ 3 లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఫోటో పోస్ట్ చేసింది.
‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన అందమైన రూపం మా అమ్మదే. ఏమి లేని పరిస్థితి నుంచి మొదలై ఇప్పుడు ఇంతవరకు సాగిన ఆమె జర్నీని నేను చూస్తూనే ఉన్నాను..
మా అమ్మ నాకు ఇన్స్పిరేషన్. ఆమె నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. అమ్మ ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. అమ్మ వల్లే ఎంతోమంది అభిమానులకు దగ్గరయ్యాను . మా అమ్మ పల్లెటూరిలో పుట్టిపెరిగింది.. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ తను కన్న కలలను వదులుకోలేదు. ఇష్టపడి, కష్టపడి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని..ఇప్పుడు నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది ..నాకోసం, ఫామిలీ కోసం అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది. నాకు సంబంధించి ఏ విషయంలో కూడా ఎప్పుడూ నో అని చెప్పిందే లేదు. నేను లావుగా ఉన్నానని అందరూ నన్ను వెక్కిరించినప్పుడు.. తనే నాకు అండగా నిలబడి ఆ మాటలు పట్టించుకోవద్దు అంటూ నా వెన్ను తట్టి నాపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఎంతో ఎంకరేజ్ చేసి.. నన్ను చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో నిలబెట్టింది. త్వరలో మా అమ్మకు 50 ఏళ్లు నిండబోతున్నాయి. ఇప్పటికీ తను ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ మమ్మా.. ఐ లవ్యూ ..’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టింది.
![]() |
![]() |